19 లక్షలు దాటిన కరోనా కేసులు..40 వేలకు చేరువైన మరణాలు

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల కరోనా సోకుతున్న వారి సంఖ్య గననీయంగా పెరుగుతోంది. రోజుుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 52,509 కరోనా కేసులు నమోదవడంతో 19లక్షలు దాటింది. దీంతో దేశంలోని కరోనా కేసుల సంఖ్య మొత్తం 19,08,255 కు చేరింది.నిన్న ఒక్కరోజే 857 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 39,795 కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 12,82,216 మంది కోలుకోగా.. ఇంకా 586244 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

వైరస్ నుంచి రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుండటం కొంచెం ఊరట కల్గిస్తుంది. నిన్న(మంగళవారం) ఒక్కరోజే 51 వేయి మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 67.19కు చేరింది.

Latest Updates