భారత్ లో మొట్ట మొదటి ప్లాస్టిక్ రోడ్డు

ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL). నొయిడా- గ్రేటర్‌ నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా సెక్టర్‌ 129 దగ్గర ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. 500 మీటర్ల నిడివి గల దీని నిర్మాణంలో 35 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపింది.

BPCL, నొయిడా మున్సిపల్ యంత్రాంగంతో చేసుకున్నఅగ్రిమెంట్ తో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ రోడ్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులతో దిమ్మెలను తయారు చేసి.. వాటిని రోడ్డు నిర్మాణంలో ఉపయోగించామన్నారు. ఈ విధానంలో మొదట ప్లాస్టిక్‌ దిమ్మెలను పరిచిన తర్వాత.. దానిపై రెండు పొరల తారును వేస్తామన్నారు. ఈ ప్లాస్టిక్‌ రహదారి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టైతే.. ఇలాంటి  రోడ్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించడం దేశంలోనే ఇది తొలిసారని BPCL తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభించినట్టేనని స్పష్టం చేసింది.

Latest Updates