శానిటేషన్‌‌‌‌ వర్కర్ల కోసం ఓ కాలేజి

  • ఇండియాలో ఇదే మొదటి ‘టాయిలెట్‌‌‌‌ కాలేజ్‌‌‌‌’
  • సంవత్సరంలో 3,200 మందికి ట్రైనింగ్‌‌‌‌
  • అందరికీ ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌

న్యూఢిల్లీ:  ఇండియాలోని మొదటి ‘టాయిలెట్‌‌‌‌ కాలేజ్‌‌‌‌’ నుంచి ఇప్పటి వరకు 3,200 మంది శానిటేషన్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ ట్రైన్‌‌‌‌ అయ్యారు. వాళ్లందరికీ ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

పారిశుధ్య కార్మికుల పని నాణ్యతను పెంచేందుకు, వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించేందుకు 2018 ఆగస్టు 18న మహారాష్ట్ర ఔరంగాబాద్‌‌‌‌లో ‘హార్పిక్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టాయిలెట్‌‌‌‌’ కాలేజీని ప్రారంభించారు. బ్రిటిష్‌‌‌‌ కంజ్యూమర్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌ ఈ కాలేజీని నిర్వహిస్తోంది. ఈ కాలేజీలో ఒక్కో బ్యాచ్‌‌‌‌కు 25–30 మంది పారిశుధ్య కార్మికులు ఉంటారు. ఆడవాళ్లకు మధ్యాహ్నం 1 – 4 వరకు, మగవారికి సాయంత్రం 4 – 7 వరకు క్లాసులు ఉంటాయి.

“ కాలేజి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3200 మందిని ట్రైన్‌‌‌‌ చేశాం. వాళ్లందరికీ పెద్ద కంపెనీల్లో 100శాతం ఉద్యోగాలు కల్పించాం. తోటి వర్కర్లకు కూడా నేర్పించేలా వాళ్లకు ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చాం” అని బ్రిటిష్‌‌‌‌ కంజ్యూమర్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌ మేజర్‌‌‌‌‌‌‌‌ రిక్కిట్‌‌‌‌ బెన్సికర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

India’s 1st ‘toilet college’ trains 3,200 workers

Latest Updates