శుక్రయాన్ లో భాగమవుతాం.. ఇస్రోకు ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్ ప్రపోజల్స్

  • వీనస్ ఆర్బిటర్ లో మా పేలోడ్లనూ పంపండి
  • 2024 లేదా 26లో వీనస్ మిషన్ కు ఇస్రో ప్లాన్
  • ఇస్రో పరిశీలనలో 20 పేలోడ్ ప్రపోజల్స్

బెంగళూరుశుక్రగ్రహంపై రీసెర్చ్ కోసం ఇస్రో చేపట్టనున్న ‘శుక్రయాన్’ మిషన్ లో తామూ పాల్గొంటామని ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్ దేశాలు ముందుకొచ్చాయి. వీనస్ ఆర్బిటర్ లో తమ పేలోడ్లూ (సైంటిఫిక్ పరికరాలు) పంపుతామని కోరుతూ ఇస్రోకు ప్రపోజల్స్ పెట్టాయి. వీనస్ ఆర్బిటర్ లో పేలోడ్లను పంపేందుకు ప్రపోజల్స్ ఇవ్వాలంటూ ఇస్రో ఇదివరకే చేసిన ప్రకటనకు మనదేశంతో పాటు ఆయా దేశాల నుంచి భారీగా స్పందన వచ్చింది. చివరగా 20 పేలోడ్ ప్రపోజల్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో ఇప్పటికే ఫ్రాన్స్ కు చెందిన ‘వైరల్ (వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్పెరిక్ గ్యాస్ లింకర్)’ పరికరాన్ని ఓకే చేశామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

2024లో వీనస్ మిషన్..

వీనస్ ఆర్బిటర్ మిషన్ ను జూన్ 2023లోనే చేపట్టాలని ఇస్రో తొలుత ప్లాన్ చేసింది. అయితే కరోనా విపత్తు కారణంగా ఈ మిషన్ గడువు మరింత ముందుకు జరిగింది. శుక్రయాన్ ను 2024లో లేదా 2026లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్ట్ ఒకరు చెప్పారు. వీనస్ ప్రతి 19 నెలలకు ఓసారి భూమికి దగ్గరగా వస్తుందని, అలా దూరం తగ్గే సమయాన్ని చూసుకుని మిషన్ ప్రారంభిస్తామన్నారు.

భూమికికవల సోదరి’..

వీనస్ ను సైంటిస్టులు భూమికి కవల సోదరిగా చెప్తుంటారు. వీనస్ బరువు, సైజు, గ్రావిటీ భూమిలాగే ఉంటాయి. ఈ రెండు గ్రహాలు 450 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడ్డాయని, వీటి పుట్టుకకు మూలం ఒక్కటేననీ భావిస్తారు. అయితే వీనస్ మన కంటే సూర్యుడికి 30 శాతం దగ్గరగా ఉండటం వల్ల ఆ గ్రహంపై సూర్యుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది.

175 కిలోల పేలోడ్లకు చాన్స్

వీనస్ పై 1960ల నుంచే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్ మాత్రమే ఇక్కడికి స్పేస్ క్రాఫ్ట్ లను పంపాయి. ఇప్పటికే వీనస్ గురించి చాలా విషయాలు తెలిసినా.. ఇంకా ఆ గ్రహం ఉపరితలం, దాని కింద ఉన్న ప్రాంతం గురించి తెలియాల్సిన సంగతులెన్నో ఉన్నాయి. వీనస్ పై వాతావరణం చాలా వేగంగా రొటేషన్ అవుతుండటం, దాని పరిణామం, దానిపై సౌరగాలుల ప్రభావం గురించి కూడా స్టడీ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై ఫోకస్ పెట్టేందుకు ఇస్రో వీనస్ ఆర్బిటర్ లో వివిధ పేలోడ్ల(పరికరాలు)ను ఉంచి పంపనుంది. ఈ ఉపగ్రహం నాలుగేళ్ల పాటు వీనస్ చుట్టూ తిరుగుతూ సమాచారం అందించనుంది. మొత్తం 2500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో 175 కిలోల పేలోడ్లను పంపేందుకు చాన్స్ ఉంటుంది.

 

 

Latest Updates