దేశంలో 17,656కు చేరిన క‌రోనా కేసులు.. 7 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా..

India's total number of Coronavirus positive cases rises to 17656

దేశంలో సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యానికి క‌రోనా కేసుల సంఖ్య 17,656కు చేరిన‌ట్లు ప్ర‌క‌టించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అందులో 559 మంది మ‌ర‌ణించార‌ని, 2842 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 14255 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించింది.

క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా గోవా, మ‌ణిపూర్

దేశంలో ప్ర‌స్తుతం ఏడు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు వెయ్యికి పైగా దాటిపోయాయి. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 4203 మందికి వైర‌స్ సోక‌గా.. 223 మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత‌ ఢిల్లీలో 2003, గుజ‌రాత్ లో 1851, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 1485, రాజ‌స్థాన్ లో 1478, త‌మిళ‌నాడులో 1477, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 1176 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో 873, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 722 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా మారాయి. గోవాలో మొత్తం ఏడు కేసులు న‌మోదు కాగా.. అంద‌రూ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మ‌ణిపూర్ లో ఇద్ద‌రికి వైర‌స్ సోక‌గా.. చికిత్స త‌ర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులేవీ న‌మోదు కాలేదు.

Latest Updates