కొలువులు లేనోళ్లు ఎక్కువయిన్రు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని తాజాగా సెంటర్‌ పర్ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐసీ) విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. గత నెల నిరుద్యోగిత రేటు మూడేళ్ల గరిష్టం 8.5 శాతానికి చేరింది. గత నెల ఇది 7.2 శాతంగా నమోదయింది. 2016 తరువాత నిరుద్యోగిత రేటు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. ఈఏడాది సెప్టెంబరులో ఇది 7.16 శాతం, ఆగస్టులో 8.19 శాతం రికార్డయింది. 2016 ఆగస్టులో ఇది 9.59 శాతానికి ఎగబాకింది. అయితే, ఈ ఏడాది మే నుంచి సెప్టెంబరు వరకు ఉద్యోగ కల్పన 25 లక్షలు పెరిగిందని సీఎంఐసీ డేటా వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 40.49 కోట్ల మందికి చేరింది.ఏప్రిల్‌ లో ఇది 40.24 కోట్లు మాత్రమే. ఇదిలా ఉంటే, మనదేశంలో మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టర్‌ కూడా బలహీనపడింది. ఈ ఏడాది సెప్టెంబరులో మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌‌ ఇండెక్స్‌‌ 51.4 శాతం ఉండగా,గత నెల ఇది రెండేళ్ల కనిష్టం 50.6 శాతానికి తగ్గింది.

India's unemployment rate rises to 3-year high of 8.5% in October: CMIE

Latest Updates