భారత బౌలర్ల దాటికి బంగ్లా విలవిల

హోల్కర్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన బంగ్లా తడబడుతోంది.  భారత బౌలర్ల దాటికి విలవిలలాడుతోంది. వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. 133 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బంగ్లా.  493/6 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇండియా. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ఇంకా 210 పరుగుల వెనుకంజలో ఉంది బంగ్లా. ముష్ఫికర్ రహీమ్ 35, లిటన్ దాస్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లకు షమీ 3,ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి.

Latest Updates