కొత్తగా ఏడు నగరాలకు ఇండిగో సర్వీసులు

కొత్తగా మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో నిర్ణయించింది. లెహ్‌, దర్భంగా, ఆగ్రా, కర్నూల్‌, బరేలీ, దుర్గాపూర్‌, రాజ్‌కోట్‌లకు ఫిబ్రవరి నుంచి విమానాలు ప్రారంభించాలని భావిస్తున్నామని ప్రకటించింది. మొదట ఫిబ్రవరిలో లేహ్‌, దర్భంగాకు ఫిబ్రవరి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్చిలో కర్నూలు, ఆగ్రా ఏప్రిల్‌ల బరేలీ, దుర్గాపూర్‌, మే నెలలో రాజ్‌కోట్‌కు సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61 దేశీయ నగరాలకు ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ సంఖ్యను 68కి పెంచాలనుకుంటున్నాట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.  దీనికి సంబంధించి రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సిఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆయా విమానాల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.

Latest Updates