రూ.8,490కే విదేశీ విమాన టిక్కెట్

విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఇండిగో. రూ.8,490కే ప్రారంభ ధరతో ఫ్లైట్ ఎక్కేయవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్ తీసుకున్నవారు నవంబర్-13 నుంచి 2020 ఏప్రిల్ 15 వరకు ప్రయాణం చేయవచ్చని చెప్పింది. అయితే నవంబర్-5 నుంచి నవంబర్-17 వరకే ఈ టిక్కెట్స్ అమ్మనున్నట్లు తెలిపింది ఇండిగో.

హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి సింగపూర్, హాంకాంగ్, కొలంబో, బ్యాంకాక్, ఇస్తాంబుల్, హోచిమిన్ సిటీ, కౌలాలాంపూర్ తదితర సిటీల్లో ఈ ప్రయాణ అవకాశాలను కల్పిస్తున్న తన అఫీషియల్ వెబ్ సైట్ లో తెలిపింది ఇండిగో. పూర్తి వివరాలకు ఇండిగో వెబ్ సైట్ చూడవచ్చు.

 

Latest Updates