ఇందిరా గాంధీ గెలిచిన మెదక్

వెలుగు: మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి 1980 ఎన్నికల్లో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రా వడంతో ఆమె ప్రధాని అయ్యారు . దీంతో దేశరాజకీయ చిత్రపటంలో మెదక్‌కు చోటు దక్కింది. ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడం వెనుక ఆసక్తికరమైన రాజకీయ కారణాలున్నాయి . ఎమర్జెన్సీ అనంతరం 1978లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా సర్కారు రెండేళ్లకే పతనమైంది. రెండేళ్లకే మళ్లీ ఎన్నికలొచ్చాయి . నార్త్ లో ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోవచ్చన్న అనుమానాలతో కాంగ్రెస్‌ సౌత్‌ మీద ఫోకస్‌ పెట్టంది. అన్ని కోణాల్లో ఆలోచించి మెదక్‌లో గెలుపు ఖాయమన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో ఇందిరా గాంధీ రాయ్‌ బరేలితోపాటు మెదక్‌ నుంచి కూడా ఎన్నికల బరిలో దిగారు.

జైపాల్‌ రెడ్డి ప్రత్యర్థి… బాగారెడ్డి ఏజెంట్‌
‌ఈ ఎన్నికల్లో ఐదుగురు క్యాండి డేట్‌‌లు పోటీ చేశారు. కాంగ్రెస్‌ (ఐ) క్యాండి డేట్‌‌గా ఇందిరాగాంధీ, జనతా పార్టీ క్యాండి డేట్‌‌గా ఎస్‌. జైపాల్‌ రెడ్డి, జనతా(ఎస్‌ ) పార్టీ క్యాండి డేట్‌‌గా కే శవరావ్‌ జాదవ్‌ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత, మాజీ మంత్రి ఎం.బాగారెడ్డి ఎలక్షన్‌‌ ఏజెంట్‌‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ గెలువడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ 67.9 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆమెకు 3,15,077 ఓట్లు రాగా, జైపాల్‌ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి . ఇక్కడ ఇందిరా గాంధీకి వచ్చిన 2,32,624 ఓట్ల ఆధిక్యమే ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ.

రాయ్ బరేలీ స్థానానికి రాజీనామా
ఈ ఎన్నికల్లో ఇందిర మెదక్‌తో పాటు తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి కూడా గెలిచారు. అయితే ఆమె రాయ్‌ బరేలీ స్థానంలో రా జీనామా చేసి మెదక్‌ నుంచే పార్లమెంట్‌‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఎంపీగానే ప్రధాని పీఠమెక్కారు. ప్రధాని ఇందిరాగాంధీ 1984 అక్టోబరు 31న హత్యకు గురయ్యే నాటికి మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. మెదక్ ఎంపీగా ఆమె పలు సందర్భాల్లో మెదక్‌ జిల్లాకు వచ్చారు. 1984 జులై 19న మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌‌ల సదస్సుకు హాజరయ్యారు. మెదక్‌లో మున్సిపల్‌ షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా ఇందిరాగాంధీ పాల్గొన్నారు.

Latest Updates