మహిళా మంత్రులు లేరెందుకు: కేసీఆర్ పై ఇందిరా శోభన్ ఫైర్

రాష్ట్ర క్యాబినెట్ లో మహిళలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇందిరా శోభన్. మొదటి క్యాబినెట్ లోనూ మహిళలు లేకుండా పాలన సాగించారని.. రెండవసారి కూడా మహిళల పట్ల వివక్ష చూపారని… సీఎం కేసీఆర్ ఫ్యూడల్ ఆలోచన కలిగినవారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 68 రోజుల తర్వాత క్యాబినెట్ ను ఏర్పాటు చేశారని విరుచుకు పడ్డారు.

తెలంగాణ సాకారానికి మహిళల పాత్ర మరువలేనిదని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్. అటువంటి మహిళలను క్యాబినెట్ లో స్థానం కల్పించకుండా కేసీఆర్ ద్రోహం చేశారని అన్నారు. ఉద్యమ ద్రోహులను కూడా మంత్రి వర్గంలో చేర్చుకున్నారని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలకు ఎలా మంత్రి పదవులిస్తారని ప్రశ్నించారు.

నిజామాబాద్ ఎంపీ కవిత.. జెండర్ ఈక్వాలిటీ అంశం పై UNO సమావేశాలకు వెళ్తున్నట్లు తెలిపారు. జెండర్ ఈక్యాలిటీ… తన తండ్రి సీఎం కేసీఆర్ క్యాబినెట్ లోనే లేదని.. ఇక ఆవిడ UNO లో ఏమని మాట్లడతారని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో మహిళా మంత్రులు లేకపోవడంతో..  మహిళల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలవడం లేదన్నారు. ఇప్పటి వరకూ మధులిక సమస్యపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని కోరారు. ఒకసారి గెలిచిన నిరంజన్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చారు కానీ.. రెండు సార్లు గెలిచిన రేఖా నాయక్ కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఇందిరా శోభన్. మంత్రి వర్గం లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు.

Latest Updates