సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు

ఇండో అమెరికన్ సంఘం

వాషింగ్టన్: సిటిజన్ షిప్ అమెండ్​మెంట్ యాక్టు(సీఏఏ)కు వ్యతిరేకంగా అమెరికాలో జరిగిన ఆందోళనల్లో పాకిస్తాన్ ఏజెంట్లు చొరబడ్డారని ఇండో అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అడపా ప్రసాద్ ఆరోపించారు. ఇండియాపై తమ ఎజెండా అమలు చేసేందుకే వాళ్లు సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారని, వాషింగ్టన్ డీసీలో ఈ మధ్యే జరిగిన నిరసనల సందర్భంగా పాకిస్తాన్ కు సపోర్టుగా పోస్టర్లు కనిపించాయని ప్రసాద్ సోమవారం మీడియాతో అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆదివారం వాషింగ్టన్ లో జరిగిన నిరసనలను లీడ్​ చేసిన మెయిన్ క్యాండిడేట్లలో ఇద్దరు పాక్ అమెరికన్లు ఉన్నారని ఆయన అన్నారు. వాషింగ్టన్ లో కాశ్మీరీ వేర్పాటువాద నిరసనలను కోఆర్డినేట్ చేసే కార్యకర్త దరాక్షన్ రాజా, ముస్లిం కార్యకర్త ఖుదై తన్వీర్ అనే ఇద్దరు పాక్ అమెరికన్లతో పాటు ఖలిస్థానీ అనుకూల కార్యకర్త అర్జున్​ సేథీ కూడా నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates