ఇండోనేసియా ఓపెన్‌ : ఫైనల్ కు సింధు

indonesia-open-semifinal-pv-sindhu-vs-chen-yufei-win-final

జకర్తా:ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌ కు దూసుకెళ్లింది. వార్ వన్ సైడ్ గా జరిగిన సెమీస్‌ లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌ లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి ఫస్ట్ టైం ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మ్యాచ్‌ ను చైనా షట్లర్‌ కాన్ఫిడెన్స్ గా ప్రారంభించింది. సింధూపై ఫస్ట్ గేమ్‌ లో 4-7తో లీడ్ లోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును ఈక్వెల్ చేసింది.

తర్వాత దూకుడును పెంచిన సింధు అటాకింగ్‌ గేమ్‌ తో మొదటి సెట్‌ ను 21-19తో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌ లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు ఎక్కువ లీడ్ సాధించింది. దీంతో 21-10 పాయిట్ల గేమ్‌తో పాటు మ్యాచ్‌ ను చేజిక్కించుకుంది.  ఫైనల్లో భాగంగా ఆదివారం జపాన్‌ స్టార్‌ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది.

Latest Updates