ఇండోనేషియా ఓపెన్: సెమీస్ లోకి సింధు

indonesia-open-sindhu-thrashes-okuhara-to-enter-semis

ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21-14, 21-7 తేడాతో జపాన్ చెందిన ప్లేయర్ నొజోమి ఒకుహారా పై వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా విఫలమైంది.శనివారం జరగనున్న సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది.

Latest Updates