11 వేల ఫీట్ల ఎత్తు నుంచి సముద్రంలో కూలింది

  • ఇండోనేసియా విమాన ప్రమాదాన్ని కన్ఫాం చేసిన ప్రెసిడెంట్
  • మనుషుల బాడీ పార్ట్స్, విమాన శకలాలు లభ్యం
  • ఫ్లైట్ లోని 62 మందీ మృత్యువాత?

జకార్తా:  ఇండోనేసియాలో మిస్ అయిన ఫ్లైట్ జావా సముద్రంలో కూలిపోయినట్లు కన్ఫామ్ అయింది. రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన 4 నిమిషాలకే విమానం నిట్టనిలువునా సముద్రంలోకి క్రాష్ అయిందని ఇండోనేసియా ప్రెసిడెంట్ జోకో విడొడో ఆదివారం వెల్లడించారు. జకార్తా సమీపంలోని ఐల్యాండ్స్ వద్ద సముద్రంలో నుంచి ఆ విమానానికి చెందిన శకలాలు, పాసింజర్ల బాడీ పార్ట్స్‌ను డైవర్లు బయటకు తీశారని చెప్పారు. విమాన ప్రమాదంపై ఆయన దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిస్ అయినవారు దొరికేలా అందరూ ప్రార్థనలు చేయాలని కోరారు. కానీ ఆర్మీ, నేవీ, సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా.. ఒక్కరు కూడా ప్రాణాలతో దొరకలే. దీంతో మొత్తం 62 మందీ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

నిట్టనిలువుగా క్రాష్

‘‘శ్రీవిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎస్జే182 (బోయింగ్ 737-500) విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తాలోని సుకర్ణో హట్టా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. నాలుగు నిమిషాల్లోనే 10,900 ఫీట్ల ఎత్తుకు చేరింది. ఆ తర్వాత అది 21 సెకన్లకే నిట్టనిలువుగా, వేగంగా కిందికి దిగుతూ 250 ఫీట్లకు చేరింది. ఆపై రాడార్ స్క్రీన్లపై విమానం అదృశ్యమైంది” అని ఫ్లైట్ రాడార్ 24 అనే ట్రాకింగ్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. థౌజండ్ ఐల్యాండ్స్ వద్ద శనివారం మధ్యాహ్నం పేలుడు శబ్దం వినిపించినట్లు మత్స్యకారులు చెప్పారు. కాగా, విమానం క్రాష్అయిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. తీవ్ర ప్రతికూల వాతావరణం వల్లే విమానం కూలిపోయిందా? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఫొటోలు, వీడియోలు వైరల్

క్రాష్ అయిన ఫ్లైట్ లోని ప్యాసింజర్లు, సిబ్బంది అంతా ఇండోనేసియాకు చెందినవారే ఉన్నారు. వీరిలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు శిశువులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా పలువురు ప్యాసింజర్లు తమ వాళ్లకు పంపిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఎయిర్ పోర్టులోని వారికి చేతులు ఊపుతూ గుడ్ బై చెప్తున్న వీడియో కంటతడి పెట్టించింది.

రెండు బ్లాక్ బాక్స్ ల జాడ తెలిసింది..

సముద్రంలో క్రాష్ అయిన ఫ్లైట్ కు చెందిన రెండు బ్లాక్ బాక్స్ లు ఉన్న ప్లేస్ ను అధికారులు గుర్తించినట్లు ఆదివారం ఇండోనేసియా ఆర్మీ చీఫ్హడీ టిజాజంటో వెల్లడించారు. వాటిని త్వరలోనే బయటకు తీసుకొస్తామని తెలిపారు. ఫ్లైట్ కు చెందిన బ్లాక్ బాక్స్ ల నుంచి నేవీ షిప్ కు సిగ్నల్స్ అందాయని, వాటి ఆధారంగానే ఫ్లైట్ క్రాష్ అయిన ప్రాంతాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఫ్లైట్ బ్లాక్ బాక్స్ లను సముద్రం నుంచి బయటకు తీసుకొస్తేనే.. ఆ విమానం అంత సడెన్ గా ఎందుకు కిందికి దిగింది? ఎందుకు క్రాష్అయిపోయిందన్నది తెలుస్తుందని సేఫ్టీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. ఫ్లైట్ యాక్సిడెంట్లకు చాలా కారణాలు ఉంటాయని, అన్నింటినీ స్టడీ చేసేందుకు నెలలకొద్దీ టైం పడుతుందని అంటున్నారు.

5 బ్యాగుల్లో బాడీ పార్ట్స్..

జాకార్తాకు దగ్గర్లోని ఐల్యాండ్స్ వద్ద 23 మీటర్ల లోతులో విమాన శక లాలు, పలువురి బాడీ పార్ట్స్ దొరికాయి. శ్రీవిజయ ఫ్లైట్‌కు చెందిన నీలి, ఎరుపు రంగు పెయింట్ ఉన్న ఓ మెటల్ పీస్ వంగిపోయిన స్థితిలో దొరికింది. ప్రమాదంలో చనిపోయిన పలువురు ప్యాసింజర్ల బాడీ పార్ట్స్‌ను సహాయక సిబ్బంది ఐదు బ్యాగుల్లో సేకరించారు. కొందరు ప్యాసింజర్ల క్లాత్ క్లాత్ పీసులు కూడా సిబ్బందికి దొరికాయి. వాటితో పాటు విమాన శకలాలను జకార్తా పోర్టుకు తరలించారు.
కూడా సిబ్బందికి దొరికాయి. వాటితో పాటు విమాన శకలాలను జకార్తా పోర్టుకు తరలించారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం

ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయినోళ్ల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ‘‘ప్లేన్ క్రాష్ కావడం దురదృష్టకరం. ఈ కష్టకాలంలో ఇండోనేసియాకు ఇండియా మద్దతుగా నిలుస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Latest Updates