హైదరాబాద్‌లో తయారైన రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ కేంద్రంగా తయారుఅవుతున్న డ్రగ్స్ ఇండోర్‌లో భారీగా పట్టుబడ్డాయి. రూ. 70 కోట్ల విలువైన 70 కేజీల ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఇండోర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేద ప్రకాశ్ వ్యాస్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఇండోర్ మీదుగా సౌత్ ఆఫ్రికాకు డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 13 లక్షల నగదు, రెండు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో వేద ప్రకాశ్ మెడికల్ రిప్రజెంటెంటివ్‌గా పనిచేసేవాడు. ఆ అనుభవంతో నగరానికి వచ్చి డ్రగ్ ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా రోజులుగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

For More News..

తెలంగాణ తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ ప్రమాణం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన గంగూలీ

దాడికి కారణమైన ట్రంప్ ట్వీట్లు.. అకౌంట్లు బ్లాక్ చేసిన సోషల్ మీడియా సంస్థలు

Latest Updates