ఇంద్రకీలాద్రి పై దొంగలు.. పట్టుకున్న ఆలయ సిబ్బంది

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కొందరిని ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఆలయంలో  దొంగతనాలు జరుగుతుండడం.. భక్తుల నుంచి పలు ఫిర్యాదులు వస్తుండడంతో ఆలయ ఈవో కొటేశ్వరమ్మ ఆదేశాలతో సిబ్బంది పక్కా నిఘా పెట్టారు. సీసీ కెమెరాల సహాయంతో దొంగల కదలికలను, వారు చేస్తున్న చోరీలను కనిపెట్టిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల సహాయంతోనే దొంగల్ని పట్టుకున్నామని ఈఓ కొటేశ్వరమ్మ  వెల్లడించారు.

Latest Updates