కరోనాతో ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ సోకి చనిపోయారు. గత కొన్నిరోజులుగా క‌రోనా మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి.. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఆయ‌న టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పాలెం శ్రీకాంత్‌రెడ్డి తండ్రి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి . ఆయ‌న ఇటివ‌లే మృతి చెందారు.

industrialist Palem Srikanth Reddy dies with Corona

 

Latest Updates