కరోనా సంక్షోభంలోనూ ఇండస్ట్రీ నెంబర్ 1 విశాక

పెరిగిన కంపెనీ సేల్స్‌ వాల్యూమ్స్‌

1.9 లక్షల చ.అ కొత్త బిల్డింగ్‌లలో వీనెక్స్ట్‌ ప్రొడక్ట్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌ కారణంతో చాలా వ్యాపారాలకు కిందటి ఫైనాన్షియల్‌ ఇయర్‌ చేదు అనుభవాన్ని మిగిల్చినా, విశాక ఇండస్ట్రీ స్‌ మాత్రం కీలకమైన మైలురాయిని అందుకుంది. 2019–20 ఫైనాన్షియల్ ఇయర్‌లో సేల్స్ వాల్యూమ్‌ పరంగా ఇండస్ట్రీ నెంబర్‌ 1 గా విశాక అవతరించింది. కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీలో అతి పెద్ద సస్టెయినబుల్‌ మెటీరియల్స్ బ్రాండ్‌గా వీ నెక్స్ ట్‌ తన పొజిషన్‌ను నిలబెట్టుకుంది. దేశంలోని 34 ప్రముఖ హాస్పిటల్స్ లలో కోవిడ్‌ కేర్‌ కోసం 1.9 లక్షల చదరపు అడుగులలో కొత్త బిల్డింగ్‌ యూనిట్లకు వీ నెక్స్ట్‌ ప్రొడక్ట్స్ నే వాడారు. ఈ కన్‌స్ట్ర క్షన్‌లో పార్టిషన్స్‌, ఫాల్స్ సీలింగ్‌, క్లాడింగ్‌, మెజానిన్‌, ఎలివేషన్‌ వంటి అవసరాల కోసం 313 టన్నుల వీ నెక్స్ ట్‌ ప్రొడక్ట్స్ ను విశాక సప్లై చేసింది. 1981లో కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి 5 లక్షల చెట్లను, 90 వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్ ఎమిషన్స్ ను కాపాడగలిగామని విశాక తెలిపింది. కరోనా వైరస్‌తో ఇండియా సహా ప్రపంచ దేశాలలో సప్లయ్‌ చెయిన్స్‌ దెబ్బతిన్నాయి. వ్యాపారాలు, జీవితాలపై కోవిడ్‌–19 తన ఎఫెక్ట్‌‌‌ చూపించింది. తన పైన, తన ఉద్యోగులపై నా ఈ ప్రభావం తక్కువగా ఉండేలా విశాక చొరవ తీసుకుంది. జూన్‌ క్వార్టర్లో అమ్మకాలు పెంచుకోవడంతోపాటు ఖర్చు తగ్గించుకోవడం వల్ల మార్జిన్స్ మెరుగు పరుచుకున్నామని విశాక పేర్కొంది. ఇంపార్టెంట్‌ మార్కెట్లయిన భివాండి, ముంబైలు రెండూ లాక్‌‌‌‌డౌన్‌తో మూతపడటంతో సింథటిక్‌ ‌‌‌యార్న్‌‌‌‌ డివిజన్‌పై ఒత్తిడి అధికమైనట్లు విశాక ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఐతే, ఎగుమతులు మాత్రం కొనసాగినట్లు పేర్కొంది. ఫలితంగా ఈ డివిజన్‌ నష్టాలు చవి చూసిందని వివరించింది. భివాండి మార్కెట్లు ఈ నెల నుంచి మళ్లీ ఓపెన్‌ కానున్నాయని, దీంతో మళ్లీ సేల్స్‌ పుంజుకుంటాయని ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది. అర్బన్‌ మార్కెట్‌ అవసరాలు నెరవేర్చే ఆటమ్‌ డివిజన్‌ సేల్స్ అంతకు ముందు ఏడాది జూన్‌ క్వార్టర్లోని రూ. 85 లక్షల నుంచి ఈ జూన్‌ క్వార్ట ర్లో రూ. 2.20 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. మొత్తం మీద చూస్తే జూన్‌ క్వార్టర్లో విశాక ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆదాయం 19 శాతం మాత్రమే తగ్గి, రూ. 285.18 కోట్ల వద్ద నిలిచింది. అంతకు ముందు ఏడాది జూన్‌ క్వార్టర్లో ఈ ఆదాయం రూ. 352.82 కోట్లు. జూన్‌ క్వార్టర్లో ఎబిటా 21 శాతం , పీబీటీ 31 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. దీంతో లాభం కూడా 49 శాతం పెరిగి రూ. 34.40 కోట్లకు చేరినట్లు పేర్కొంది. అంతకు ముందు ఏడాది జూన్‌ క్వార్టర్లో కంపెనీకి రూ. 23.07 కోట్ల లాభం వచ్చింది.

తగ్గుతున్న కంపెనీ అప్పులు

అంతకు ముందు ఏడాది జూన్‌ క్వార్టర్ తో పోలిస్తే కంపెనీ నికర అప్పులు కూడా రూ. 193 కోట్ల నుంచి రూ. 80 కోట్లకు తగ్గిపోయాయి. ఈ అప్పులు రాబోయే కాలంలో మరింత తగ్గనున్నట్లు కంపెనీ పేర్కొంది. రాబోయే క్వార్టర్లో వీ నెక్స్ ట్‌ డివిజన్‌ సేల్స్‌ రెండంకెల గ్రోత్‌ సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. గత నాలుగైదేళ్లలోనే మెరుగైన పనితీరును ఈ ఏడాది సాధించగలమనే ధీమాను చూపిస్తోంది.

Latest Updates