ఇదేం కరోనా ఛాలెంజ్: వైరస్ సోకి ఆస్పత్రి పాలైన యువకుడు

కరోనా వైరస్ పై జోకు లేస్తే ఆస్పత్రి పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఒకటే మాట కరోనా వైరస్. కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు చిన్నాభిన్నమవుతుంటే  అదే వైరస్ తో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు  ఒకరికొకరు చాలెంజ్ లు విసురుకుంటున్నారు. ఆ ఛాలెంజ్ లు ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

సోషల్ మీడియాలో మనం రకరకాల చాలెంజ్ ల గురించి విన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కరోనా వైరస్ ఛాలెంజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనా వైరస్ ఛాలెంజ్ లో కార్లను, బైక్ లను, బాత్‌రూం డోర్లను, టాయిలెట్ సీట్ అంచుల్ని నాలుకతో టచ్ చేయాలి. అదే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఎవరైతే చేస్తారో వాళ్లు వేరే వాళ్లకు విసురుతారు.

అయితే ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఛాలెంజ్ పాల్గొన్న ఓ యువకుడు పలు మార్లు కారు డోర్లు, టాయిలెట్ సీటు అంచుల్ని, బైక్ హ్యాండిల్స్ ను తన నాలుకతో టచ్ చేశాడు. అలా టచ్ చేయడంతో ఆ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా బాధితుడు తనకి కరోనా వైరస్ సోకిందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Latest Updates