ప్రజలారా కరోనా వైరస్‌ని స్ప్రెడ్ చేయండి: ప్రచారం చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి

ప్రజలారా కరోనా వైరస్‌ని స్ప్రెడ్ చేయండి  అంటూ ఓ టెక్ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కలకలం రేపుతోంది. బెంగళూరు ప్రాంతానికి చెందిన 25ఏళ్ల ఇన్ఫోసిస్ ఉద్యోగి కరోనా వైరస్ నుంచి స్ప్రెడ్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తమైన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. విచారణ సందర్భంగా నిందితుడు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు..నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

విధుల నుంచి తొలగించిన ఇన్ఫోసిస్

కరోనా వైరస్ పై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురవుతున్న తరుణంలో సంస్థ ఉద్యోగి ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేయడంపై ఇన్ఫోసిస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తూ ప్రచారం చేశాడని తమ సంస్థ అంతర్గత దర్యాప్తు లో తేలడంతో సదరు ఉద్యోగిని  విధుల నుంచి తొలగించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

Latest Updates