సినీ నటుడు విశాల్ కు గాయాలు

ప్రముఖ కోలీవుడ్‌ హీరో,నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు షూటింగ్‌లో తీవ్రగాయాలయ్యాయి. సీ. సుందర్‌ దర్శకత్వంలో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌  సినిమా ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. షూటింగ్‌లో ఓ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా విశాల్‌ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్‌ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకోనుంది. కాగా ఫైట్‌ సీన్లను ఎలాంటి డూప్‌ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. గతంలోనూ ’తుప్పరివాలన్’  సినిమా షూటింగ్‌లోనూ గాయపడ్డాడు.

Latest Updates