రోహిత్,ధావన్ కు గాయాలు..మూడో వన్డేకు డౌటే!

రాజ్ కోట్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌ లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ గాయపడ్డారు. దీంతో  ఆదివారం జరగబోయే మూడో వన్డేకు ఆడతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. శుక్రవారం జరిగిన  మ్యాచ్ లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌ లో డీప్‌ పాయింట్‌‌‌‌లో బౌండ్రీని ఆపే క్రమంలో  రోహిత్‌ ఎడమ భుజానికి గాయమైంది. రోహిత్‌ మైదానాన్ని వీడడంతో కేదార్‌ జాదవ్‌ ఫీల్డింగ్‌ చేశాడు. మరో ఓపెనర్‌ ధవన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. పదో ఓవర్లో కమిన్స్‌ వేసిన బాల్‌ ధవన్‌ కుడి పక్కటెముకలను బలంగా తాకింది. తాత్కాలిక చికిత్స తీసుకుని ఇన్నింగ్స్‌ కొనసాగించిన ధవన్‌ .. ఫీల్డింగ్‌ కు రాలేదు. అతని ప్లేస్‌ లో చహల్‌ బరిలోకి దిగాడు. ధవన్‌ బాగానే ఉన్నాడని మేనేజ్​మెంట్ చెప్పినా స్కానింగ్‌ చేయించిన తర్వాతే గాయం తీవ్రతపై క్లారిటీ రానుంది.

Latest Updates