వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై తెలంగాణ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో రైతులకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ బిల్లుకు  కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అని పేరు పెడితే బాగుంటుందన్నారు. కార్పొరేట్ ఆదాని, అంబానీ వాళ్ళకి లాభం వచ్చేలా ఉందన్నారు. బిల్లులో ఏ ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కంపెనీలకు  రైతులతో టాయాప్ అయ్యే విదంగా బిల్లు ఉంది కానీ… రైతులకు ఏమి లేదన్నారు. విత్తన రైతులకు కూడా నష్టమేని…ప్రైవేట్ కంపెనీలు ఎలా కొనుగోలు చేస్తాయో చెప్పలేదన్నారు. కనీస మద్దతు ధర మీద కూడా సరైన క్లారిటీ లేదన్న ఉత్తమ్.. ఈ బిల్లు ఏ ఒక్క రైతుకి లాభం లేదన్నారు. వ్యవసాయ బిల్లుతో మార్కెట్ యార్డ్ లు మూసివేసే అవకాశం ఉంటుందన్నారు. బీహార్ లో మార్కెట్ యార్డ్స్ క్లోజ్ చేయడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారన్నారు ఉత్తమ్.

వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడుగా మారనుందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. బిల్లుతో చిన్న సన్న కారు రైతులు నష్టపోనున్నారని తెలిపారు. అంతేకాదు ఇది కార్పొరేట్ కంపెనీలకు లాభం వచ్చేలా ఉందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోకసభ చర్చలో పాల్గొనలేదు కానీ …రాజ్యసభలో మాత్రం ఎదో చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు గోతికాడి నక్కలగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ కు  దమ్ముంటే బిళ్లకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాడా.. అని ప్రశ్నించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న రాష్ట్రంలో రైతుల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు రేవంత్ .

Latest Updates