గ్రామీణ ప్లేయర్లకి అన్యాయం : HCA జిల్లా సెక్రటరీల ఆందోళన

గ్రామీణ స్థాయి  ప్లేయర్లకి  అన్యాయం  జరుగుతోందంటూ  హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్  జిల్లా  సెక్రటరీలు  ఆందోళనకు దిగారు.  విజయ్ హజారే  టోర్నీ  సెలక్షన్స్  కోసం  నిర్వహిస్తున్న ఛాలెంజర్స్   ట్రోఫీకి… జిల్లా  ప్లేయర్లని  ఎంపిక చేయలేదన్నారు.  ECIL గ్రౌండ్స్ లో  నిరసన తెలిపిన  జిల్లా సెక్రటరీలు.. ప్రతిభ ఉన్న జిల్లా  ప్లేయర్లకు  అన్యాయం జరుగుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని  HCA అధికారులు , కమిటీ  ఆఫ్  అడ్మినిస్ట్రేషన్ దృష్టికి  తీసుకెళ్లారు.