
ఒకే పనిని రెండుసార్లు ప్రారంభించారు
అంబర్ పేట్ ఎమ్మెల్యే, కాచిగూడ కార్పొరేటర్ మధ్య విభేదాలు
కాచిగూడ, వెలుగు: అంబర్ పేట్ టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. డివిజన్లో ఏ డెవలప్మెంట్ పని ప్రారంభించినా ఎమ్మెల్యే కాలేర్ వెంకటేశ్ తనను పిలవడం లేదని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం డివిజన్ పరిధిలోని విక్రమ్ నగర్లో ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించిన పైప్ లైన్ నిర్మాణ పనులను, గురువారం టీఆర్ఎస్ కార్పొరేటర్ చైతన్య మళ్లీ ప్రారంభించారు. ఒకే పనిని ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రారంభించడంతో అంబర్ పేట్ టీఆర్ఎస్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని ఇలాగే వ్యవహరిస్తే అధిష్టానానికి కంప్లయింట్ చేస్తానని కార్పొరేటర్ చెప్పారు.
For More News..