విజయనగరం జిల్లాలో రోడ్డు దుస్థితిపై వినూత్న నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని  అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు. బురదమయమైన రోడ్లపై అరటి మొక్కలు నాటారు. నీళ్లు తోడారు. చేపలు పట్టారు. ఈత కొట్టారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషాను కలిపే ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు.

Latest Updates