ఒలంపిక్స్ స్పాన్సర్ గా ఐనాక్స్

న్యూఢిల్లీ: టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కు వెళ్లే ఇండియా టీమ్ కు ఐనాక్స్ సంస్థ అఫీషియల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ), ఐనాక్స్ లీసర్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. దేశవ్యాప్తం గా మల్టీప్లెక్స్ లు నిర్వహిస్తున్న ఐనాక్స్ గ్రూప్ .. ఒలింపిక్స్ కు వెళ్లే ఇండియా టీమ్ ను స్పాన్సర్ చేస్తోందని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ప్రకటించారు. అంతేకాక తమ మాల్స్ లో ఇండియన్ అథ్లెట్లకు ప్రోత్సాహం లభించే విధంగా ఐనాక్స్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుం దని మెహతా చెప్పారు. ఐఓఏతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఇండియన్ అథ్లెట్లు ఒలింపిక్స్ లో సత్తా చాటాలని ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్దా ర్థ్​ జైన్ అన్నారు.

Latest Updates