ప్రజలు తిరగబడితే ఆపలేం.. ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్

  • ప్రజలు శక్తి వంతులు వాళ్లు తిరగబడితే ఎవరు ఆపలేరు
  • అభివృద్ధిలో ముందున్నా.. కార్మికులకు మందులివ్వలేరా
  • రెండు వారాలుగా సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది : హైకోర్ట్

ఆర్టీసీ సమ్మెపై  ప్రభుత్వం అడిషనల్ కౌంటర్ కాపీ దాఖలు చేసింది. ప్రభుత్వం పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్..ఆర్టీసీ కార్మికులకు మద్దుతు పలుకుతూ పలు ప్రశ్నలు సంధించింది. ఆర్టీసీపై ఆందోళన జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదు..?  కార్మికుల ఒక్క సమస్యనైనా పరిష్కరిస్తామని ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వలేదు..? రెండు వారాలుగా సమ్మె జరుగుతుంటే  ప్రభుత్వం ఏం చేస్తోంది..? తార్నాక ఆస్పత్రిలో మందులు లేవు. కార్మికులకు ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వడానికి ఇబ్బందులేంటి..? బస్సులకు విడి భాగాలు ఇవ్వడానికి ఇబ్బందేంటి..?  అని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ఇతర సమస్యలపై హైకోర్ట్ లేవనెత్తింది. ఆరోగ్య శ్రీ కార్డుల్లేవు, రేషన్ కార్డ్ ల్లేవు, యూనిఫామ్ లు లేవని అన్నది. అయితే హైకోర్ట్ ప్రశ్నోత్తరాలపై స్పందించిన ప్రభుత్వం … రవాణా శాఖ కార్యదర్శి సమర్ధులు..అందుకే ఎండీని నియమించలేదని చెప్పింది. కార్యదర్శి సమర్ధుడైతే ఎండీగా నియమించవచ్చుకదా అని ప్రశ్నించింది హైకోర్ట్ . ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చదగినవేనన్న కోర్ట్ ..డిమాండ్లకు పరిష్కారాలున్నాయని సూచించింది. అయితే ఆర్ధిక సమస్యల వల్ల కార్మికుల డిమాండ్లను నెరవేర్చలేమని చెప్పింది ప్రభుత్వం .

Latest Updates