588 మందితో కొచ్చి చేరుకున్న జలాశ్వ

  • మాల్దీవుల నుంచి వచ్చిన యుద్ధ నౌక

కొచ్చి: ఆపరేషన్‌ సముద్ర సేతు ఫేజ్‌–2లో భాగంగా శనివారం మాల్దీవుల నుంచి బయలుదేరిన నేవీ వార్‌‌షిప్‌ ఐఎన్‌ఎస్‌ జలాశ్వ ఆదివారం కొచ్చికి చేరుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా మాల్దీవుల్లో చిక్కుకున్న 588 మందిని కొచ్చికి చేరుకున్నారని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పటికి మూడు బ్యాచ్‌లు సముద్ర మార్గం ద్వారా ఇక్కడికి చేరుకున్నారన్నారు. ఈ నెల 10న మొదటి ఫేజ్‌ లో భాగంగా 698 మందిని స్వదేశానికి చేర్చిన జలాశ్వ రెండో ట్రిప్‌లో 588 మందిని తీసుకొచ్చింది. కాగా మరో నేవీ షిప్‌ మాగర్‌‌ 202 మంది మనవాళ్లను సొంత ప్రదేశాలకు చేర్చింది.

Latest Updates