కరోనా భయంతో బంకర్లలో దాక్కుంటున్నసంపన్నులు

అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనాలు వందల్లో చనిపోతున్నారు. దీంతో వైరస్‌‌‌‌ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అమెరికా సిలికాన్‌‌‌‌ వ్యాలీలోని బిలియనీర్లు భూమిపై కాకుండా అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ఉండేలా ప్లాన్‌‌‌‌ చేసుకుంటున్నారు. కరోనా పోయేదాకా న్యూజిలాండ్‌‌‌‌లో కొనుక్కున్న బంకర్లకు వెళ్లి సెటిలైపోతున్నారు. ప్రస్తుతానికి బంకర్లు లేనోళ్లు కూడా కొనేందుకు సిద్ధమవుతున్నారు. వాటిని కట్టే కంపెనీకలు ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కూడా కొత్త వాటిని చకచకా రెడీ చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు.

అప్పుడట్లా.. ఇప్పుడిట్లా

ఒకప్పుడు బంకర్లు వార్‌‌‌‌ జోన్లలోనే కనబడేవి. శత్రువుల నుంచి, వాళ్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి వీటిని వాడేవాళ్లు. సొరంగాల్లా, చీకటిగా, గాలి కూడా సరిగా రాకుండా ఇరుకుగా ఉండేవి. పెద్ద పెద్ద ప్రమాదాలొస్తాయని అనుకున్నప్పుడే వాటిల్లోకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు బంకర్ల తీరు మారింది. ఇండ్ల మాదిరి లగ్జరీగా డిజైన్‌‌‌‌ చేస్తున్నారు. లైఫ్‌‌‌‌ సేఫ్టీ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి బంకర్లకు న్యూజిలాండ్‌‌‌‌ కేరాఫ్‌‌‌‌గా మారింది. మహమ్మారి రోగాలొచ్చినప్పుడు వాటి నుంచి రక్షణ కోసం వై కాంబినేటర్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ సామ్‌‌‌‌ అల్ట్‌‌‌‌మన్‌‌‌‌  గతంలో న్యూజిలాండ్‌‌‌‌లో ఓ బంకర్‌‌‌‌ను కొన్నారు. దీంతో బంకర్ల విషయం పెద్ద పెద్ద బిలియనీర్లకు తెలిసింది. ఇప్పటికే పేపాల్‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ బిలియనీర్‌‌‌‌ పీటర్‌‌‌‌ థియెల్‌‌‌‌, టెక్సాక్‌‌‌‌ బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌ కంపెనీ జనరల్ మేనేజర్‌‌‌‌ రూ. 35 కోట్లు పెట్టి న్యూజిలాండ్‌‌‌‌ క్వీన్స్‌‌‌‌ టౌన్‌‌‌‌లో బంకర్‌‌‌‌ కొన్నారు.

డిజైన్‌‌‌‌ను బట్టి రేట్లు

బంకర్ల రేట్లు వాటిని డిజైన్‌‌‌‌ చేసిన తీరును బట్టి ఉంటాయి. హోటల్‌‌‌‌లో లగ్జరీ సూట్‌‌‌‌ లాంటి బంకర్‌‌‌‌ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అంతకు మించి సదుపాయాలుండే వాటి రేటు రూ. 22 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు ఉంది. సౌదీ అరేబియాకు చెందిన ఓ బిలియనీర్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ లోంచి దిగి వెళ్లేలా సెటప్‌‌‌‌ ఉండాలన్నారు. అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ టన్నెల్‌‌‌‌ నుంచి మెయిన్‌‌‌‌ రూమ్‌‌‌‌కు డైరెక్ట్‌‌‌‌గా కనెక్షన్‌‌‌‌ ఉండాలని చెప్పారు. ఇలాంటి సదుపాయాలతో బంకర్లు రెడీ చేసేందుకు రూ. 400 కోట్ల పైనే ఖర్చవుతుందని కంపెనీ చెప్పింది. అమెరికాలోని కాన్సస్‌‌‌‌లో కూడా సర్వైవల్‌‌‌‌ కండో కంపెనీ 14 లగ్జరీ బంకర్లను ఇంతకుముందే ఏర్పాటు చేసింది. న్యూక్లియర్‌‌‌‌ దాడుల నుంచి రక్షణ కోసం నిర్మించింది. అక్కడ కూడా సకల సౌలత్‌‌‌‌లు ఉన్నాయి.

బంకర్‌లో ఏముంటయ్‌?

న్యూజిలాండ్‌లో రైసింగ్‌ ఎస్‌ కో కంపెనీ 10 బంకర్లను రెడీ చేసింది. ఇవి చాలా లగ్జరీ సదుపాయాలతో ఉంటాయి. ఒక్కో బంకర్‌లో 22 మంది వరకు ఉండొచ్చు. ఇందులో మూడు మాస్టర్‌ బెడ్రూమ్‌లు, లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌, ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఆవిరి స్నానం చేసేందుకు సెటప్‌ కూడా ఉంది. కొన్ని బంకర్లు భూమిలో రెండు, మూడంతస్థుల్లో కూడా ఉన్నాయి. వీటికి నిరంతరాయంగా ఆక్సిజన్‌, కరెంట్‌ అందే ఏర్పాటుంటుంది. మూడేళ్ల పాటు తినేందుకు ఆహార పదార్థాలు కూడా రెడీగా ఉంటాయి. కొన్నింట్లో వాటర్‌ ఫాల్‌, క్లైంబింగ్‌ వాల్‌, మూవీ థియేటర్‌, గార్డెన్లు, చేపలు పెంచుకునే సెటప్‌ ఉంటాయి. 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది.

Latest Updates