డాక్టర్‌నంటూ అమ్మాయిలతో పరిచయం.. తర్వాత బ్లాక్ మెయిల్

‘కబీర్ సింగ్’ సినిమా చూసి నకిలీ డాక్టర్ అవతారమెత్తాడో వ్యక్తి. డాక్టర్‌నంటూ అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని బ్లాక్‌మెయిల్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీకి చెందిన 31ఏళ్ల ఆనంద్ కుమార్ డేటింగ్ వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు.  తనను ఆర్థోపెడిక్ సర్జన్‌గా టిండర్ వెబ్‌సైట్‌లో పరిచయం చేసుకునేవాడు. ప్రియమ్ యాదవ్ అనే వ్యక్తి సాయంతో టిండర్‌లో తన పేరును డాక్టర్ రోహిత్ గుజ్రాల్ అని నమోదు చేసుకున్నాడు. వెబ్‌సైట్‌లోని అమ్మాయిలతో అలా పరిచయం చేసుకొని మాట కలిపేవాడు. అలా ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటానని నమ్మించి.. ఆమె దగ్గర నంచి 30 వేల రూపాయలు కొల్లగొట్టాడు. అలా చాలామందిని డాక్టర్ పేరుతో మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా చెప్పినట్లు వినకపోతే వారి ఫొటోలు, వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ సెల్) అన్యేష్ రాయ్ మాట్లాడుతూ.. ‘కుమార్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడుపుతున్నాడు. మోడల్స్ మరియు నటులు కావాలని కోరుకునే చాలా మంది పురుషులు మరియు మహిళలతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఆర్థోపెడిక్ సర్జన్ అని చెప్పుకుంటూ డాక్టర్ రోహిత్ గుజ్రాల్ పేరుతో టిండర్, బంబుల్ మరియు జీవన్ సాతి వంటి మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు వివిధ డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. కబీర్ సింగ్ చిత్రంలో షాహిద్ కపూర్ ఆర్థోపెడిక్ సర్జన్ పాత్రలో నటించడం చూసి ఆనంద్ ఇలా ప్లాన్ చేశాడు. అతను మహిళలతో కనెక్ట్ అయిన తర్వాత.. వారి నుంచి ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడటం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత వారిని వివాహం చేసుకోవటానికి ఒప్పించేవాడు. వారు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత వారిని ప్రైవేట్ చిత్రాలు మరియు వీడియోలను పంపమని కోరేవాడు. కుమార్ నాలుగు నెలలుగా ఇలా చేస్తున్నాడు. ఈ నాలుగు నెలల వ్యవధిలో కుమార్ చాలామంది మహిళలను కలిశాడు. వారిలో ఒక మహిళ కుమార్ కోసం 5 లక్షల రూపాయల అప్పు కోసం కూడా దరఖాస్తు చేసింది’ అని ఆయన తెలిపారు.

ఆనంద్ కుమార్‌ను ఆయన సోషల్ మీడియా ఐడి ద్వారా గుర్తించి.. ఆనంద్‌తో పాటు ప్రియమ్ యాదవ్‌ను కూడా లాజ్‌పత్ నగర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

వీడియో: కరోనా కట్టడికి నాలుగేళ్ల చిన్నారి జాగ్రత్తలు

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్

Latest Updates