సుశాంతే నాకు ఇన్స్పిరేషన్ : చంద్రమండలంపై భూమిని కొని భార్యకు గిఫ్ట్

చాలామంది గతంలోనే చంద్రుడిపై భూమి కొన్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఈ మధ్యే చనిపోయిన సుశాంత్ సింగ్ కూడా చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. తాజాగా పాక్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు పెళ్లిరోజు కానుకగా చంద్రమండలంపై భూమిని కొనుగోలు చేశాడు.

తాజా సమాచారం ప్రకారం రావల్పిండికి చెందిన 22ఏళ్ల సోహైబ్ అహ్మద్ చంద్రమండలంపై ‘సీ ఆఫ్ వాపూర్’ అని పిలిచే ప్రాంతంలో చంద్రమండలంపై భూముల రిజిస్ట్రేషన్ చేసే ఓ అంతర్జాతీయ సంస్థతో సంప్రదింపులు జరిపాడు. సుమారు 45డాలర్లకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాక్ చెందిన సమ్మాటీవీ కథనం ప్రకారం..ఆ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్మద్ మాట్లాడుతూ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేరణ పొందినట్లు చెప్పారు. సుశాంత్ పై ఇష్టంతోనే చంద్రమండలంపై భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

పెళ్లి రోజు గుర్తుగా తన భార్యాకు తాను చంద్రమండలంపై కొన్న భూమి గురించి తన స్నేహితులకు చెబితే నమ్మలేదని, తన భార్య మదిహా సైతం తన మాటల్ని నమ్మలేదని అహ్మద్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మొదట అందరూ నవ్వినా చివరకు చంద్రమండలంపై తాను భూమిని కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్లు చూపించడంతో నమ్మినట్లు అహ్మద్ తెలిపాడు.

Latest Updates