టిక్ టాక్ యూజర్స్ కు గుడ్ న్యూస్ : మీ టాలెంట్ ను బయట పెట్టేందుకు రెడీగా ఉండండి

త్వరలో ఇండియన్ టిక్ టాక్ యూజర్స్ కు శుభవార్త అందనుంది. ఇండియాకు చెందిన నెటిజన్లు తమలోని టాలెంట్ ను ప్రదర్శించేందుకు  టిక్ టాక్ ను అస్త్రంగా వినియోగించుకున్నారు. ఫేమస్ అయ్యారు.  వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అయితే దేశ భద్రత విషయం పై అనుమానం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. దీంతో టిక్ టాక్ లో తాము పడిన కష్టం వృధా అయ్యిందని క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేసినా దేశం కోసం అండగా నిలిచారు.

తాజాగా టిక్ టాక్ యూజర్స్ సంతోషం వ్యక్తం చేసేలా మరో సోషల్ నెట్ వర్క్ సంస్థ ఇన్ స్ట్రా గ్రామ్ ఓ శుభవార్త తెలిపింది. టిక్ టాక్ తరహాలో ఇన్ స్టా గ్రామ్ వీడియో షేరింగ్ ఫీచర్ ను భారత్ లో డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్ కు చెందిన ప్రముఖ టిక్ టాక్ క్రియేటర్స్, యూ ట్యూబ్ క్రియేటర్స్ తో కలిసి ఇన్ స్టా గ్రామ్ రీల్స్ పేరుతో షార్ట్ వీడియో ఫీచర్ ను అందుబాటులో తెస్తున్నట్లు తెలిపింది. ఈ ఇన్ స్టా గ్రామ్ ఫీచర్ ను ఇంతకు ముందే బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ లో రిలీజ్ చేశారు. వాటి తరువాత మన దేశంలో అందుబాటులోకి తెస్తున్నారు.  టెస్టింగ్ దశలో ఉన్న కొత్త ఫీచర్ లో ఈ రోజు రాత్రి 7: 30కు తెలుగులో ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ జాహ్నవి దాసెట్టి,  హిందీలో రాధిక బంగియా,  ఇంద్రాణి బిస్వాస్ అకా వండర్‌ మున్నా, అమ్మీ విర్క్ తో పాటు పలువురి వీడియోల్ని విడుదల చేస్తున్నట్లు ఇన్ స్టా గ్రామ్ టీమ్ తెలిపింది.

ఇన్ స్టా గ్రామ్ రీల్ ఫీచర్ ఎక్కడ ఉంటుంది

యూజర్స్ టిక్ టాక్ తరహాలో 15 సెకన్ల వీడియోను క్రియేట్ చేయడానికి ఇన్ స్టా గ్రామ్ లో కెమెరా ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం  స్క్రీన్ కు కింద భాగంలో ఉన్న రీల్స్ ఆప్షన్ ను క్లిక్ చేసి 15సెకన్ల వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటు క్రియేటర్స్ సినిమా సాంగ్స్  వీడియోల్ని క్రియేట్ చేసేలా టూల్ ను డిజైన్ చేశారు. అంతేకాదు కెమెరా ముందు నిలబడి వీడియోను రికార్డ్ చేసే సమయంలో ఒక వీడియో ను ఎక్కువ సార్లు ఎడిట్ చేయడం కానీ అదే వీడియోలో ఫన్నీ క్లిప్స్, ఎఫెక్ట్స్ ను యాడ్ చేసుకునే అవకాశాన్ని ఇన్ స్టా గ్రామ్ కల్పించింది.

ఇతర దేశాల్లో క్రియేటర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా డిజైన్

బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీలలో ఇన్ స్టా రీల్స్ ఫీచర్ పై టెస్టింగ్ దశలో ఉండగా ఆయా దేశాలకు చెందిన క్రియేటర్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేసేలా ఇన్ స్టా  రీల్స్ డాష్ బోర్డ్ పై ఐజీ టీవీ (ఇన్ స్టా గ్రామ్ టీవీ) తరహాలో ఎక్కువ వీడియోల్ని ప్రమోట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని కోరారు. దీంతో ఇండియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఇన్ స్టా రీల్స్ ఫీచర్ లో క్రియేటర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఎక్కువ వీడియోలు డిస్ ప్లే అయ్యేలా డెవలప్ చేసినట్లు ఇన్ స్టా గ్రామ్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఫేస్‌ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ మాట్లాడుతూ భారత్ కు చెందిన మూడు శాతం ఇన్ స్టా గ్రామ్ వీడియో కంటెంట్ లో 15సెకన్లు లేదా అంతకంటే తక్కువగా 45శాతం ఉన్నట్లు తెలిపారు. ఇన్ స్టా రీల్స్ ను మరింత ఎంటర్ టైన్ మెంట్ గా అభివృద్ధి చేసేందుకు భారత్ కు చెందిన ప్రముఖ క్రియేటర్స్ భాగస్వామ్యంలో పని చేస్తున్నామని  ఫేస్‌ బుక్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్  విశాల్ షా తెలిపారు.

Latest Updates