ఇన్​స్టాగ్రామ్​లో గ్రూప్​చాట్

ఫొటో, వీడియో షేరింగ్​ యాప్​ ఇన్​స్టాగ్రామ్​లో మరో కొత్త ఫీచర్​ వచ్చింది. ఫాలోవర్లతో ప్రత్యేక గ్రూప్​ ఏర్పాటు చేసుకునే అవకాశం కలగనుంది. ‘చాట్​స్టిక్కర్’ అనే పేరుతో రానున్న ఈ ఫీచర్​ ద్వారా అనేక స్టోరీస్​ను ప్రవేశపెడుతోంది. గ్రూప్​ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోల్స్, క్వశ్చన్​ బాక్సెస్, మెన్షన్స్,  లొకేషన్స్,  హ్యాష్​ట్యాగ్స్, కౌంట్​డౌన్స్​ వంటి స్టోరీలను నిర్వహించుకోవచ్చు. అంటే గ్రూపు ఏర్పాటు చేసుకుని పోల్స్​ నిర్వహించడం, ఒపీనియన్స్​ కలెక్ట్​ చేయడం వంటివి చేయొచ్చు. అయితే గ్రూపులో చేరాలంటే ముందుగా స్టిక్కర్​ ద్వారా రిక్వెస్ట్​ పంపించాలి.

Latest Updates