ఇన్‌స్టాగ్రామ్‌లో సరి కొత్త ఫీచర్‌

సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. లేటెస్టుగా రీసెంట్లీ డిలిటెడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మన ఎకౌంట్‌ నుంచి డిలీట్, రిమూవ్‌ చేసిన పోస్ట్‌లు, వీడియోలు,  రీల్స్, ఐజీటీవీ వీడియోలు…30 రోజుల లోపు రీస్టోర్‌ చేసుకోవచ్చు. 30 రోజుల తర్వాత ఇవి ఆటోమెటిగ్గా డిలిట్‌ అయిపోతాయి. డిలిట్‌ కంటెంట్‌ కోసం సెట్టింగ్‌-ఎకౌంట్‌-రీసెంట్‌ డిలిటెడ్‌లోకి వెళ్లాలి. డిలిట్‌ అయినవి హ్యాకర్ల బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. యూజర్ల కోరికతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు  ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది.

Latest Updates