పెట్రోల్‌కు బదులుగా..

వేరే ఇంధనాల వైపు చూడండి

న్యూఢిల్లీ: క్రూడాయిల్ దిగుమతి దేశానికి అతిపెద్ద ఆర్థిక సవాలుగా మారుతోంది. అంతర్జాతీయంగా నెలకొంటోన్న పరిణామాలతో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగిపోతూ.. మన వాణిజ్య లోటును మరింత పెంచుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కారు కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అభ్యర్థించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు ఉంటుందని చెప్పారు. బయో ఫ్యూయల్ జనరేషన్ కోసం అగ్రికల్చర్‌‌‌‌ను పవర్, ఎనర్జీలకు డైవర్సిఫై చేయాల్సినవసరం ఉందన్నారు.

‘ప్రభుత్వం నుంచి మేము మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. ఈ రంగానికి ఎల్లప్పుడూ మా సపోర్టు ఉంటుంది. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను అభివృద్ధి చేయాలని ప్రోత్సహిస్తున్నాం. అన్ని రకాల సపోర్టు మేము ఇస్తాం. పాత తయారీ విధానంతో పాటు, ప్రత్యామ్నాయ ఇంధనాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం’ అని ‘న్యూజెన్ మొబిలిటీ సమిట్ 2019’లో గడ్కరి తెలిపారు. క్రూడాయిల్‌‌కు ప్రత్యామ్నాయంగా… దిగుమతి పరంగా, కాలుష్య రహితంగా, సరియైన ధర ఉండే విధానమే ప్రభుత్వ విధానమని గడ్కరి చెప్పారు. ఈ దిశగా పనిచేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేబినెట్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ అడ్వయిజరీకి ప్రత్యేక సూచనలు చేసినట్టు తెలిపారు.

మూలధన ఖర్చులో 20 శాతం ఇదే..

మన మూలధన ఖర్చులో దిగుమతి బిల్లు 20 శాతం ఉందని, అదే దేశ ఎకానమీకి అతిపెద్ద సవాలుగా ఉంటున్నట్టు గడ్కరి అన్నారు. దీనికి ఒక పరిష్కారం కనుగొనాల్సినవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి మంచి రెవెన్యూలు అందిస్తూ.. ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో ఆటో మొబైల్ సెక్టార్ ఒకటిగా ఉందని మంత్రి కొనియాడారు. ఆటో మొబైల్ సెక్టార్‌‌‌‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టోయోటా, హ్యుండాయ్ లాంటి పాపులర్ బ్రాండ్స్ బ్రెజిల్‌‌లో ఫ్లెక్సి ఇంజిన్లను తయారు చేస్తున్నాయని,ఇండియాలో అలాంటివి ఎందుకు ట్రై చేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఇంధనం లాంటి పలు ఆప్షన్లను కన్జూమర్లు ఎంపిక చేసుకుంటారని చెప్పారు.

అగ్రికల్చర్ డైవర్సిఫై అవసరం…

క్రూడాయిల్ దిగుమతులతో పాటు ఎకానమీ ఎదుర్కొంటోన్న మరో ప్రాబ్లమ్, అగ్రికల్చర్ రంగంలో చెరుకు, బియ్యం, గోధుమలు అత్యధికంగా ఉత్పత్తి కావడమేనని గడ్కరి అన్నారు. దీని కోసం అగ్రికల్చర్ రంగాన్ని  డైవర్సిఫై చేయాల్సినవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన పవర్, ఎనర్జీకి దీన్ని బదలాయించాలని పేర్కొన్నారు.

Latest Updates