బ్యాంకులో దాచుకున్న సొమ్ముకు ఇన్సూరెన్స్

ఇటీవల కాలంలో బ్యాంకు ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. బడా పారిశ్రామికవేత్తలు కొందరు భారీగా లోన్లు తీసుకుని బ్యాంకులకు టోపీలు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్ము భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ఓ భరోసానిచ్చింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బ్యాంకులో ప్రజల డిపాజిట్లకు ఇన్యూరెన్స్‌ను పెంచారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఇప్పటి వరకు బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత ఉన్నా దివాళా తీసే పరిస్థితి వస్తే రూ.1 లక్ష వరకు బీమా ఇచ్చేదని చెప్పారామె. అయితే ఈ ఇన్సూరెన్స్‌ను ఇకపై రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిాపారు ఆర్థిక మంత్రి. అంటే ఇకపై ఏవైనా బ్యాంకులు దివాళా తీస్తే వస్తే రూ.5 లక్షల వరకూ డిపాజిట్ చేసి ఉన్న వారికి ఆ మొత్తం సొమ్మును ప్రభుత్వం వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేస్తుంది. అయితే అంతకన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఉన్నా సరే రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి.

మరిన్ని వార్తలు

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు

Latest Updates