ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

Inter board extends supplementary, re verification, recounting application deadline

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన  అవకతవకలపై  సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ స్పందించింది.  మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో..  వారి విజ్ఞ‌ప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండగా… మరో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్ష, రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు 27వ తేదీ  చివరి తేదీ అని తెలిపింది.

Latest Updates