తప్పులు ఇంటర్ బోర్డువి..శిక్ష విద్యార్థులకు.!

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపిన గందరగోళ పరిస్థితులు ఎంసెట్, నీట్ సిద్ధమయ్యే విద్యార్థులపై ప్రభావం తీవ్రంగా పడింది. ఇంటర్ బోర్డు తప్పిదాలకారణంగా మే 3, 4, 6 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష, మే 8, 9 తేదీల్లో జరిగే అగ్రికల్చర్‍, ఫార్మసీ, మే 5న దేవ వ్యాప్తంగా జరుగనున్నమెడికల్‍, బీడీఎస్‍ ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులపై పడనుం ది. ఇంటర్‍ మార్కులకు ఎంసెట్ లో 25 శాతం వెయిటేజీ ఉంది. దీని కారణంగా విద్యార్థులు ఈసారి తీవ్రంగా నష్టపోనున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఇంటర్‍ పరీక్షల్లో ఆశించిన మార్కుల కంటే తక్కువగా వచ్చాయని ఎంసెట్ లో ఆ మేరకు వెయిటేజీ తగ్గిపోయి ర్యాంకుల్లో పడిపోతామని పలువురువిద్యార్థులు నిరాశలో కూరుకుపోతున్నారు .

రీ వెరిఫికేషన్ అప్లై చేసుకున్నామని అందులో వచ్చేమార్కులు పెరగకపోతే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‍,ఫార్మసీ కళాశాలల్లో సీట్లు రావని విద్యార్థులు, వారితల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు . ఫలితాలువిడుదలై ఇన్ని రోజులు అవుతున్నా ఫలితాల పట్లవిద్యార్థులు ఆందోళన చెందుతూనే ఉన్నారు . నిత్యంఇంటర్‍ బోర్డు, వెరిఫికేషన్ సెం టర్లకు విద్యార్థులు,వారి పేరెంట్స్ తరలివస్తూనే ఉన్నారు . మరో రెండువారా ల్లో ఎంసెట్‍, నీట్ పరీక్షలు ఉన్నాయని కానీరిజల్ట్ గందరగోళం మధ్య విద్యార్థులు చదువుపై కాన్సన్‍ట్రేట్‍ చేయలేకపోతున్నట్లు ఎంసెట్, నీట్ లకుకోచిం గ్ ఇచ్చే సెంటర్ల నిర్వాహకులు అభిప్రాయబడుతున్నారు . ఇలాంటి పరిస్థితిలో ఈ సారి విద్యార్థులు ఎంసెట్ కంటే నీట్ లో తెలంగాణ విద్యార్థులు బాగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు .ఎంసెట్ ర్యాంకులపై ప్రభావంఫస్ట్ ఇయర్‍ బాగా చదివి టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఈ ఏడు సెకండియర్‍ పరీక్షల్లోమాత్రం తక్కువ మార్కులు పొందారు . కొందరైతేఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలవ్వడంతో కన్నీరు మున్నీరవుతూ ఇంటర్ బోర్డుకు పరుగులుతీశారు. మరి కొందరు స్టూడెంట్స్ పరీక్షలు బాగారాసి నప్పటికీ అన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినట్లు బోర్డు దగ్గరకు వచ్చిన విద్యార్థులు తెలిపారు.

ప్రభుత్వం ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తునప్పటికీ ఎంసెట్ లో మంచి ర్యాంకు ను ఆశిస్తున్నటాప్ స్టూడెంట్స్ మళ్లీ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. రీ వెరిఫికేషన్ లో మార్కులు పెరగకపోయేఅవకాశాలు ఉన్నాయని ముం దుగానే సప్లిమెం టరీఫీజులను కట్టామని పలువురు స్టూడెంట్స్ చెప్పారు .అలాగే ర్యాంకు లు తెస్తారనుకున్న విద్యార్థులు అత్తెసరు మార్కులతో పాస్ అవ్వడంతో కార్పొరేట్విద్యా సంస్థలు విద్యార్థులతో సప్లిమెం టరీ పరీక్షలు రాయించేందుకు ఫీజులను కట్టిస్తున్నాయి.ఎంసీసీ, బైపీసీలోని ప్రధాన సబ్జెక్టుల్లో మార్కులు తక్కువొచ్చిన విద్యార్థులు ఇటూ సప్లిమెం టరీ పరీక్షలకు అటూ ఎంసెట్‍, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు . ఎంపీసీ, బైపీసీలోని మ్యాథ్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చినమార్కులే ఎంసెట్‍  విద్యార్థుల ర్యాంకులను ప్రభావితం చేస్తా యి. గ్రూప్ సబ్జెక్టులకు థియరీ, ప్రాక్టికల్స్కలిపి 600 మార్కులు ఉంటాయి. ఈ మార్కులనుఎంసెట్ లో 25 శాతం వెయిటేజీ ఇస్తారు . ఎంసెట్ లోని 160 మార్కులకు 75 శాతం వెయిటేజీఉంటుంది. ఈ రెండిం టీని కలిపి ఎంసెట్ లో విద్యార్థుల తుది ర్యాంకును ఖరారు చేస్తారు .

 

Latest Updates