ఏ జవాబు పత్రమూ మిస్ కాలేదు: ఇంటర్ బోర్డు సెక్రటరీ

ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, అంతా సక్రమంగా జరిగిందని చెప్పారు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ అశోక్‌ కుమార్‌. పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరణాల క్రమంలో సోమవారం  విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నేతలు ఇంటర్‌ బోర్డు ముందు ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో అశోక్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ బోర్డు పాదర్శకంగానే పనిచేస్తుందని.. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని చెప్పారు.

బోర్డు పారదర్శకంగా పనిచేసి ఫలితాలు అందించామని.. నవ్య విషయంలో 9 నెంబర్ బబ్లుంగ్ చేసే బదులు 0 చేశారు. అందుకే 90 మార్కుల అమ్మాయికి 0 వచ్చాయని తెలిపారు. 90 మార్కులకు… 0 మార్కులు వేసిన ఎగ్జామినర్, స్క్రూటినీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఛార్జ్ మెమో ఇచ్చామని… ఫైన్ కూడా వేస్తామన్నారు.

అబ్సెంట్ అయిన వారికి… పాస్ అయినట్టు ఎక్కడ వేయలేదని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమయం గడువు పెంపును పరిశీలిస్తామని తెలిపిన అశోక్ కుమార్.. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలు రాయని వాళ్ళు కూడా పాస్ అయ్యరనేది అవాస్తవమని.. ఏ పేపర్లు గల్లంతు కాలేదన్నారు. మీకు అనుమానం ఉంటె జవాబు పత్రాలు చూపిస్తామని.. సెంటర్లు మారడం వల్ల కొంత ఇబ్బందులు అయ్యాయని తెలిపారు అశోక్ కుమార్.

Latest Updates