ఇంటర్ కాలేజీలకు షాక్: పేరెంట్స్ అప్పుడే అడ్మిషన్స్ తీసుకోవద్దు

ఇంకా ప్రస్తుత విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలైనా పూర్తి కాకుండా అప్పుడే వచ్చే ఏడాదికి అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలకు ఇంటర్ బోర్డు షాక్ ఇచ్చింది. 2020-21 విద్యా సంత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీల వివరాలు ఆధారాలతో సహా తమకు అందాయని ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటున్న ఆయా కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్ కాలేజీలపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు జాగ్రత్త

రాష్ట్రంలో చాలా ప్రైవేటు కాలేజీలు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకముందే అడ్మిషన్లు ఎన్‌రోల్ చేస్తున్నాయని సయ్యద్ ఒమర్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 2020-21 సంవత్సరానికి ఏ ఒక్క కాలేజీ కూడా అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు తమ పిల్లల కోసం అడ్మిషన్లు తీసుకోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వారు అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ముందే ఫీజు కట్టేసిన విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతారని హెచ్చరించారు.

Latest Updates