ఇంటర్ విద్యార్థి తల్లిని ఈడ్చుకెళ్లిన పోలీసులు

హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో తప్పిదాలపై సోమవారం ఇంటర్‌ బోర్డ్‌ పై ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయానికి తాళాలు వేశారు. విద్యార్థులు ఆందోళనల చేస్తుండటంతో ఇంటర్‌ బోర్డ్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. న్యాయం అడగడానికి వచ్చిన విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించారు. అధికారులతో మాట్లాడాలని కోరిన ఓ విద్యార్థినిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లాక్కునివెళ్లి అరెస్ట్‌ చేశారు. అడ్డుకున్న విద్యార్థి తల్లిని కూడా దారుణంగా ఈడ్చుకెళ్లారు.

పోలీసుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. ఆడవారు అనికూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్తున్నారని..ఇదే నా ప్రజాస్వామ్యం అంటూ పోలీసులను నిలదీశారు విద్యార్థుల తల్లిందండ్రులు. అయినా వారి మాటలు పట్టించుకోని పోలీసులు పలువురి స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Latest Updates