ఏప్రిల్ చివరి వారం నుంచి ఇంటర్ పరీక్షలు!

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2021 పరీక్షలు ఏప్రిల్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1నుంచి ఇంటర్ క్లాసులు మొదలు అవుతాయిని..రెండు నెలల తరగతుల తర్వాత ఏప్రిల్ చివరి వారంలో నుంచి మే నెల వరకు ఎగ్జామ్స్ నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఇంటర్ బోర్టు అధికారి తెలిపారు. ఏప్రిల్ రెండో వారంలో ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. త్వరలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. అంతేకాదు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఎలాంటి మార్పులుండవని చెప్పారు.

Latest Updates