3 సబ్జెక్టుల్లో ఫెయిల్: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Inter girl committed suicide, reason is failed in exams

జగిత్యాల:ఇంటర్ పరీక్షలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్ధిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన విద్యార్ధిని వొడ్నాల శివాని గా తెలిసింది. పోచంపేట్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Latest Updates