ఈటల ఇంటిని ముట్టడించిన విద్యార్ధి సంఘాలు

కరీంనగర్ లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టించారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్ధులు ఇబ్బందులు పెడుతున్నా..  ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బుధవారం ధర్నా చేపట్టారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇంటర్ బోర్డు సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు లేకుండా రీ వాల్యుయేషన్ చేయాలని కోరారు.  పోలీసులు నచ్చచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో…  బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Latest Updates