గురుకులాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 84%

సోషల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఇంటర్‌ సెకండియర్‌ లో 84.36 శాతం ఉత్తీర్ణత సాధించాయని గురుకులాల కార్యదర్శి ఆర్‌ .ఎస్‌ . ప్రవీణ్‌‌‌‌కుమార్‌  తెలిపారు. 8,877 మంది ఇంటర్‌ పరీక్షలు రాయగా7,484 మంది పాస్‌ అయ్యారని, 5,165 మంది ఏగ్రేడ్‌ సాధించారని చెప్పారు. 14 కాలేజీల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఎంపీసీలో చిల్కూర్‌ (బాయ్స్‌‌‌‌) కాలేజీ విద్యార్థి వి. తరుణ్‌‌‌‌ 985 మార్కులతో టాపర్‌గా నిలిచారు. బైపీసీలో గౌలిదొడ్డి (బాలికలు) విద్యార్థిని బి. నందిని 987 మార్కు లు, ఎంఈసీలో కల్లూర్‌ (బాలికలు) విద్యార్థిని ఎం.నర్మద 965 మార్కు లు, సీఈసీలో పోచంపాడు (బాలికలు)విద్యార్థిని హెప్సి బా 956 మార్కు లు, హెచ్‌ ఈసీలో పోచంపాడు (బాలికలు) విద్యార్థిని బి. సాక్షి 942 మా ర్కులతో టాపర్లుగా నిలిచారు. ఫస్టియర్‌ ఫలితాల్లో79.63 శాతం విద్యార్థులు పాస్‌ అయ్యారు.

ట్రైబల్‌ లో నాలుగు కాలేజీలు వంద శాతం…

ట్రైబల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీల3,317 మంది సెండియర్‌ పరీక్షలు రాయగా 2,732 మంది ఉత్తీర్ణులయ్యారు. 4 లేజీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. 1,611 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌ సాధించారు. ఎంపీసీలో జె. సునీల్‌ (రాజేంద్రనగర్‌ ) 984 మార్కు లు, బైపీసీలో వి.శివకుమార్‌ (రాజేంద్రనగర్‌ ) 978 మార్కు లు, సీఈసీలో ఎం.అమృత (కల్వకుర్తి) 931 మార్కు లు, హెచ్‌ ఈసీలో వి.ఉష (అంకంపాలెం ) 912 మార్కులు, ఎంఈసీలో ఎ.స్వరూప (భద్రాచలం) 855 మార్కు లతో టాపర్లుగా నిలిచారు. జూనియర్‌ ఇంటర్‌ లో 72.56 శాతం స్టూడెంట్స్‌‌‌‌ పాస్‌ అయ్యారు.

Latest Updates