పైసా కట్టం.. ఫ్రీ గా పేపర్లు దిద్దాలి | అమ్మాయి కన్నీళ్లు

హైదరాబాద్ : ఇంటర్ బాధిత విద్యార్థుల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి తన బాధ చెప్పుకుంటున్నారు. ముందు ఫెయిలై… తర్వాత రీ వాల్యుయేషన్ లో ఎక్కువ మార్కులు వచ్చినవారు.. సాక్ష్యాలు చూపుతూ ఇలాగేనే బోర్డు పనిచేసేది… ఇలాగైతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నారు.

తన కూతురుకు ఇంటర్ ఫస్టియర్ లో 90కి పైగా పర్సెంటేజీ సాధించిందనీ.. ఇపుడు అన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వేశారని ఓ తండ్రి ఆవేదనగా చెప్పారు. సీఎం ఏమో బాగా చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని చెబుతారు.. కానీ.. ఇపుడు ఎవరికి చెప్పుకోవాలి అని అడిగారు.

తాను సిటీలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుకుంటున్నానని బాధిత విద్యార్థిని చెప్పింది. మార్కులు చూసి షాకయ్యాననీ.. న్యాయం కావాలని కన్నీళ్లు పెట్టుకుంటూ కోరింది. “మా పేపర్లు ఎలా దిద్దారో మాకు తెలియదు.. మేం సరిగా రాసినప్పుడు.. సరిగా దిద్దడానికి వారికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావడం లేదు. వాళ్లకు కూడా పిల్లలు ఉండే ఉంటారు కదా…  ఏం చేస్తారో మాకు తెలియదు… మా పేపర్లు కరెక్షన్ చేయాల్సిందే. ఒక్క పైసా కూడా కట్టం. ఫ్రీగా రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ చేయాలి” అని ఆ అమ్మాయి ఆవేదనగా చెప్పింది.

Latest Updates