ఇంటర్ ఫలితాల్లో గందరగోళం : మెమోలు తప్పుల తడకలు

ఇంటర్మీడియల్ ఫలితాల్లో సాంకేతిక కారణాలతో తప్పులు వచ్చాయి. తమ రిజల్ట్ చూసుకున్న కొందరు విద్యార్థులు షాక్ అయ్యారు. అధికారులకు ఫిర్యాదులు చేశారు.

ఆన్ లైన్ లో చూసుకున్న ఫలితాల్లో పలు తప్పులు దొర్లాయి. మార్క్స్ రావాల్సిన చోట యాబ్సెంట్ ఫెయిల్, యాబ్సెంట్ పాస్(A F, A P) అని తప్పులు తప్పులుగా రిజల్ట్ చూపించింది. అవేంటో అర్థం కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇంగ్లీష్, సంస్కృతం సబ్జెక్టుల్లో మార్కులు ఉండాల్సిన చోట A F,  A P అని రావడంతో.. స్టూడెంట్స్ పరేషాన్ అవుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో టాప్ మార్కులు వచ్చి… ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అని రావడంతో… తమ రిజల్ట్ తప్పుగా వచ్చిందని విద్యార్థులు అంటున్నారు.

సాంకేతిక కారణాలతోనే ఈ తప్పులు దొర్లినట్టు తెలుస్తోంది. ఫలితాలకు ముందు డేటాను సరైన పద్ధతిలో పొందు పర్చక పోవడమే కారణమని అంటున్నారు. పరీక్ష నిర్వహణలోనూ పలు తప్పులు దొర్లాయి. ఒక పేపర్ బదులు మరో పేపర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఫలితాలపై పడినట్టు తెలుస్తోంది. అనుభవం లేని సంస్థకు బాధ్యతలు అప్పగించడమే దీనికంతటికీ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపాలు సరి చేయకుండానే.. ఆదరాబాదరాగా ఫలితాలను విద్యాశాఖ ప్రకటించిందని విమర్శలు వస్తున్నాయి.

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. నిన్న కొద్ది నిమిషాల్లోనే ప్రెస్ మీట్ ను ముగించి వెళ్లిపోయారు అధికారులు.

Latest Updates