ఇంటర్ రీవెరిఫికేషన్ ఆన్ లైన్ లోనే

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పైనా కరోనా ఎఫెక్ట్ పడింది. ఈసారి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ ఉండవనే ప్రచారంతో వీటికి భారీగానే అప్లికేషన్లు వచ్చాయి. దీనికి తోడు ఇంటర్ బోర్డులో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి ఆన్​లైన్​లోనే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యే అవకాశముంది.

బోర్డుకు 85శాతం పేపర్లు 

ఇంటర్మీడియెట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్​కు మొత్తం 73,984 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో రీవెరిఫికేషన్ కు 59,651, రీకౌంటింగ్ కు 14,333 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్ల వివరాల ఆధారంగా అధికారులు వెంటవెంటనే వివిధ జిల్లాల క్యాంపుల నుంచి ఆ ఆన్సర్​షీట్లను బోర్డుకు తెప్పిస్తుంటారు. కానీ లాక్​డౌన్​తో పాటు ఇంటర్ బోర్డులోని పరీక్షల విభాగం అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో బోర్డుకు ఎవరూ రావడం లేదు. దీంతో ఇప్పటి వరకు 85 శాతం  ఆన్సర్​షీట్లే బోర్డుకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో మిగిలినవీ బోర్డుకు చేరుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్సర్ షీట్ల స్కానింగ్ ప్రాసెస్ కూడా కొనసాగుతోంది. దీంతో బుధవారం నుంచే రీవెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయనున్నారు.

 20 వరకు రిజల్ట్స్

ప్రస్తుతం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్​కు మ్యాథ్స్, ఇంగ్లీష్, సివిక్స్, కామర్​కు ఎక్కువ, లాంగ్వేజీ సబ్జెక్టులకు తక్కువ అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది ఏ సబ్జెక్టు ప్రాసెస్  పూర్తయితే, వెంటనే వాటి రిజల్ట్స్ ను ఆన్​లైన్​లో అప్డేట్ చేసేవారు. కానీ ఈసారి అన్ని సబ్జెక్టుల ప్రక్రియ పూర్తయ్యాక, ఒకేసారి ఆన్​లైన్​లో రిజల్ట్ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 20 వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయనున్నట్టు తెలిపారు.

ఇట్ల చేస్తరు

ఇంతకముందు వరకు ఎంపిక చేసిన ఎగ్జామినర్లు ఇంటర్ బోర్డుకు వచ్చి  రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసేవారు. కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో ఈ విధానానికి స్వస్తి చెప్పారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఉన్న లెక్చరర్లనే ఎగ్జామినర్లుగా ఎంపిక చేయనున్నారు. వారికి వెబ్ నార్, జూమ్ యాప్ ద్వారా అధికారులు ట్రైనింగ్ ఇచ్చి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వనున్నారు. వాటి ఆధారంగా ఎగ్జామినర్లంతా ఇంటి నుంచే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయనున్నారు. వారి పనితీరును బోర్డు నుంచి అధికారులు మానిటరింగ్ చేస్తారు. వారికేమైనా సందేహాలున్నా, సమస్యలు ఏర్పడినా తీర్చేందుకు హెల్ప్​లైన్​ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.

ఉద్యోగమని పిలిచి మోసం చేస్తారా?

Latest Updates